సీతాఫలం
ఈ పంటను అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో,  మెట్ట భూములలో సాగు చేయవచ్చు. ఈ పండ్లు కార్బో హైడ్రేట్లు,  విటమిన్ సి, విటమిన్ ఎ కలిగి ఉంటాయి. ఐస్ క్రీం, పాల సంబంధిత పదార్థాల తయారీలో ఉపయోగపడతాయి.  సీతా ఫలం ఆకులు, గింజలు, ఇతర భాగాలలో ‘అనోనైన్’ అనే పదార్ధం ఉండడం వల్ల అవి చేదుగుణం కలిగి ఉంటాయి. అందుకే ఈ చెట్టు ఆకులు, గింజలను పశు జీవాలు తినవు. ఆకులు, గింజల నుంచి తీసిన రసంలో కీటక నాశని లక్షణాలు ఉంటాయి. గింజల నుంచి 27 – ౩0 శాతం దాకా లభిస్తుంది. ఈ నూనెను సబ్బు, పెయింటు పరిశ్రమల్లో వాడతారు. మన రాష్ట్రంలో   దాదాపు 2500 ఎకరాలలో సీతాఫలం సాగవుతోంది.  మొత్తం  ఉత్పత్తి 5000 మెట్రిక్ టన్నుల వరకు ఉంది.
ఇది ఉష్ణ మండలం పంట. ఎక్కువ చలి, మంచుకి తట్టుకోలేదు. చలి ఎక్కువ ఉండే ప్రాంతాలలో కాయలు పండు బారకుండా గట్టిగా నల్లగా మారుతాయి. అయిటే ఈ పంట ఎక్కువ వానను  తట్టుకుంటుంది. వాన లేకున్నా తట్టుకుని నిలబడుతుంది.  వేడి రాత్రులు, మామూలు ఎండలు, పుష్పించే దశలో  పొడి వాతావరణం, కాయ దశలో ఎక్కువ తేమ,  50 – 75 సెంటి మీటర్ల వాన ఈ పంటకు అనుకూలం. ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే,  పూత రాలిపోయి పిందెలు ఏర్పడవు.    

నేలలు
చౌడు, క్షార నేలలు మినహా మిగతా అన్ని రకాల నేలల్లో సీతాఫలం చెట్లు పెరుగుతాయి. ఇవి పెరిగే నేలల్లో మురుగు నీరు నిలవ ఉండకూడదు.  నీరు నిలవని చెలక నేలలు, గరుకు నేలలు, ఎర్ర నేలలు, గరప నేలలలో మంచి దిగుబడి వస్తుంది. రాళ్ళతో కూడిన గరకు నేలలలో కూడా ఈ చెట్లు పెరుగుతాయి.  

 

రకాలు;


రకం

ఒక చెట్టుకి ఫలాల దిగుబడి
(4 ఏళ్ళ తరువాత)

ముఖ్య లక్షణాలు

బాలా నగర్

45 –  80

కాయలు పిరమిడ్ ఆకారంలో పెద్ద కళ్ళతో పెద్ద సైజులో ఉంటాయి.  కాళ్ళ మధ్య లేత పసుపు నుంచి నారింజ రంగులో ఉంది చూడడానికి ఆకర్షణీయంగా కనపడతాయి.   రుచి బాగుంటుంది.  గరుకైన గుజ్జుతో ఉంటాయి.  సగటు బరువు 260 గ్రాములు.  26% చక్కర ఉంటుంది. 

ఆర్క సహాన్

55 – 80

ఐలాండ్ జెం, మమ్మోత్ రకాలను సంకర పరిచి అభివృద్ధి చేసిన రకం ఇది. కాయలు గుండ్రంగా ఉంటాయి. కళ్ళు స్పష్టంగా ఉండవు. నునుపుగా ఉంటుంది. సగటు బరువు ౩00 గ్రాములు. చక్కర ౩0% ఉంటుంది. చాల తీయగా ఉంటాయి. గింజలు కూడా తక్కువే. అధిక సాంద్రతలో నాటుకోవడానికి అనుకూలం.  

అతి మోయ

10- - 150

కాయలపై  చర్మం నునుపుగా ఉంటుంది. ఈ రకం చెట్లు పర పరాగ సంపర్కం ద్వారా అభివృద్ధి అవుతాయి. అందుకని ప్రతి 10 చెట్లకు ఒక సీతాఫలం చెట్టు నాటాలి. గింజలు తక్కువ.  గుజ్జు తీపి, పులుపు కలగలసి, ఒక ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటాయి  

ఐలాండ్ జెం

౩0

ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న రకం.  కాయలు చాల పెద్దవిగా ఉంటాయి. చర్మం నునుపుగా ఉంటుంది.  పండు నాణ్యత బాగా ఉంటుంది.

పింక్స్ మమ్మోత్

40

ఇది కూడా ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న రకమే. కాయ పెద్దగా అండాకారంలో ఉంటుంది. పండు ఆకారం నిర్దిష్టంగా ఉండదు. చర్మం ఆకుపచ్చ మీద గులాబి రంగు కలిగి ఉంటుంది. పండులో గింజలు తక్కువగానే  ఉంటాయి. అయితే గుజ్జు కూడా తక్కువగానే ఉంటుంది.

 
విత్తడం / నాటడం
ప్రవర్ధనం :
వేనీర్ పద్ధతి ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు.  సీతాఫలం విత్తనాలు సేకరించిన వెంటనే నారు పోస్తే మొలకెత్తవు. రెండు నెలల తరువాత,  25 x  15  సెంటి మీటర్ల సైజు పాలిథీన్  సంచికి  4 – 6 రంధ్రాలు చేసి, 1.5 కిలోల  పాంటింగ్  మిక్చర్, 1 : 1 : 1 నిష్పత్తిలో బాగా చివికిన పశువుల ఎరువు, ఇసుక, నేల మట్టి.,  5 – 8 గ్రాముల సూపర్ ఫాస్పేట్, 100 గ్రాముల వేప పిండి కలిపి, దానితో సంచుల పై అంచు వరకు నింపాలి.  దాంట్లో 1 .5. – 2 సెంటి మీటర్ల లోతులో సీతాఫలం విత్తనాన్ని నాటాలి. ౩0 – 40 సెంటి మీటర్ల ఎత్తు పెరిగే వరకు అంట్లను  పెంచాలి.     
అంటు కట్టడానికి ఫిబ్రవరి – ఏప్రిల్ వరకు అనుకూల సమయం.  వేరు మూలం మెత్తని భాగంలో ౩ – 4 సెంటి మీటర్ల నిలువు గాటు చేసి, లోనికి ౩ – 4  సెంటి మీటర్లు ఒక వైపున చెక్కిన సయాను పుల్లని అమర్చాలి.  నీరు, గాలి లోనికి పోకుండా పాలిథీన్  రిబ్బనుతో  గట్టిగా ముడి వేయాలి.  100 – 120 రోజుల్లో లేత కొమ్మ అంటు తయారవుతుంది. దీనిని నాటుకోవాలి.
నర్సరీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
నీరు పోసేటప్పడు అంటుఫైభాగంలో ఫై  పడకుండా జాగ్రత్త వహించాలి.  బుతువును బట్టి  ప్రతి రోజు లేక రోజు మార్చి రోజు నీరుపోయాలి. అంటుకట్టిన 50 - 60 రోజుల తర్వాత పాలిధీన్ రిబ్బను తీసివేయాలి. నర్సరీలో రసాయనిక ఎరువులు వాడరాదు. వర్షకాలంలో నర్సరీలో నీరు నిలవకుండా చూడాలి.
నాటడం :
ఎన్నిక చేసిన పొలంలో 60x60x60  సెం. మీ. గుంతలను 5x5 మీ. (ఎకరాకు 160 మొక్కలు ) లేదా 6x6 మీ . (ఎకరాకు 110 మొక్కలు ) ఎడంలో తీసి నాటుకోవాలి. గుంటకు 20 కి పశువులు ఎరుపు 1కిలో సింగిల్ సూపర్ ఫాస్పేట్, 100 గ్రా . ఫాలిడాల్ 2% పొడి ఫై మట్టితో బాగా గుంతలు నింపాలి . 3 - 4 రోజుల ముందు నీరు పారించాలి. వర్షాకాలం ప్రారంభం కాగానే నాటాలి. వెనీర్ అంట్లు నాటాలి . వెనీర్ అంట్లు నాటాలి. నాటేటపుడు అంటుభాగం భూమి నుండి 10 - 20 సెం. మీ ఫైకి ఉండేలా చూడాలి. గుంత మధ్యలో నాటి అవసరమైతే ఊతం ఏర్పాటు చేయాలి.
కత్తిరింపులు :
వేరు మూలంఫై చిగుళ్ళను కొమ్మలను వెంట వెంటనే తీసివేయాలి. ఆకృతి లేని తెగుళ్ళు సోకినా కొమ్మలను కత్తిరించి (జనవరి - మార్చి ) చిగురించి పరిస్ధితిని కల్పించాలి. 2-3 సంవత్సరాల్లో అనవసరపు కొమ్మలు కత్తిరించి చెట్టుకు నిర్ధిష్టమైన ఆకారం కల్పించాలి.
 

నీటి యాజమాన్యం:
వాతావరణ పరిస్ధితులనుబట్టి మొదట 2 - 3 రోజుల కొకసారి తర్వాత 4 - 7 రోజుల కొకసారి నీరు పారించాలి డ్రిప్ పద్ధతి పాటించి నీరు సమృద్ధిగా పారి స్తే పెరుగుదల దిగుబడి అధికంగా ఉంటుంది. 20 లీటర్ల నీరుపట్టె  కుండలను భూమిలో డ్రిప్ జోన్లో పాదుల్లో అమర్చి పిచ్చర్ పద్ధతిలో నీటినివ్వాలి. కుండలోని చిన్న రంధ్రం ద్వార భుమిలోనికి నీరుకారి వేర్లకు నీరు అందుతుంది. నీటివసతి లేకపోతే చెట్లుబాగా పెరిగే వరకు 2-3 సంllల వరకువేసవిలో నీరుపోయాలి. నీరు తక్కువైతే కాయలు గట్టిగా మారి పండుబారవు. చెట్లు పాదుల్లో 8 సెం.మీ. మందం వేరుశనగ పొట్టు లేదా వారి పొట్టును వేసి తేమను ఎక్కువ కాలముండేటట్లు చూడాలి. వరసకు, వరసకు మధ్య 5శాతం వాలు కల్పించి వర్షపు నీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి. ఎండాకాలంలో నీరు పెడితేబాగా పెరిగి ముందుగా పంట నిస్తుంది. 
పత్ర విశ్లేషణ: మొక్కకు కావలసిన పోషకాలను తగిన మోతాదులో అందించేందుకు పత్ర విశ్లేషణ చేయిoచాలి. దీని ఆధారంగా ఎరుపులను మరియు సూక్ష్మ పోషక పదార్ధలను వాడితే మంచిది. ఇందుకుగాను జూన్ మాసంలో 4 నెలల వయసుగల కొమ్మలనుండి ఒకటవ ఆకును తొడిమతో సహా ౩౦ ఆకులను సేకరించి పరీక్షకు పంపాలి.

 

ఎరువుల యాజమాన్యం :
సీతాఫలం చెట్టు ఎరువులకు బాగా ప్రతిస్పందించి మంచి దిగుబడులనిస్తుంది. 50 కి పశువులు ఎరువు, 1 కి. ఆముదపు పిండి , 1 కి ఎముకల పొడిని ఒక చెట్టు పాదులో ఒకసారి జూన్ -జులైలో వేసుకోవాలి. 250 గ్రా. నత్రజని(500 గ్రా యూరియా) 125 గ్రా. భాస్వరం (700 గ్రా. సింగిల్ సూపర్ ఫాస్పేట్), 125 గ్రా. పొటాష్(200 గ్రా.మ్యూరేట్ ఆఫ్ పొటాష్) చెట్టు పాదుల్లో తేమవున్నపుడు రెండు దఫాలుగా వేసుకోవాలి(జూన్-జూలై),(ఆగష్టు-సెప్టెంబరు). జీవన ఎరువైన అజటోబ్యా ర్ ను చెట్టుకి 250 గ్రా. వరకు వేసుకోవటం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చు.

 

కలుపు నివారణ :
మొదటి 3-4 ఏళ్ళ వరకు వేరుశనగ, అపరాలు, అలసంద వంటి పంటలతో పాటు నీటి వసతి ఉంటే కూరగాయలను అంతరపంటలుగా పండించవచ్చు. పచ్చిరొట్ట పంటలను చెట్లు మధ్యలో వేసి పూతరాక ముందు (ఆగష్టులో) దున్నాలి. మామిడిలో తతెలిపిన కలుపు నివారణ చర్యలను పాటించి  సీతాఫలంలో కలుపును నివారించవచ్చు